తెలుగులో అఖండ విజయాన్ని అందుకున్న ‘అఖండ’ సినిమాపై బాలీవుడ్ ఇండస్ట్రీ కన్నేసిందని టాక్. అఘోరా క్యారెక్టర్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఓ రేంజ్లో ఉండటంతో రీమేక్ రైట్స్ కొనాలని సాజిద్ నడియాడ్ లాంటి ప్రొడ్యూసర్లు ప్లాన్ చేస్తున్నారట.
ఈ కథకు కొంచం కమర్షియల్ టచ్ ఇస్తే మంచి హిట్ అవుతుందని భావిస్తున్నారట. ఇందులో హీరోగా అక్షయ్ కుమార్ లేదా అజయ్ దేవ్ ను లాంటి స్టార్లను తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.