Home / SLIDER / ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కంగుతినడం ఖాయం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కంగుతినడం ఖాయం

ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కంగుతినడం ఖాయమని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. కనీసం బీఫారం కూడా ఇవ్వకుండా అభ్యర్థిని నిలబెట్టిన కాంగ్రెస్‌ కుటిల రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. ఎక్స్ అఫీషియో సభ్యులు హోదాలో సూర్యాపేటలోని పోలింగ్ కేంద్రంలో మంత్రి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి విజయం సాధిస్తారని స్పష్టం చేశారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, ఇతర పార్టీల సభ్యులు కూడా టీఆర్ఎస్ వైపు నిలవడం శుభపరిణామం అన్నారు. సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని పార్టీలకతీతంగా ఓటేసిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయ ఆధారితమైన నల్లగొండ జిల్లా కేసీఆర్ పాలనలో ఎంత ససశ్యామలం అయిందో స్థానిక ప్రజాప్రతినిధులు గుర్తించారని చెప్పారు. ఉహించనంత మెజార్టీతో కోటిరెడ్డి గెలవ బోతున్నారని జోస్యం చెప్పారు. నల్లగొండ జిల్లా తమకు కంచుకోట అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నేతలకు ఈ ఎన్నికల్లోనూ ఆశాభంగం తప్పదన్నారు.

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కంగుతినడం ఖాయమని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. కనీసం బీఫారం కూడా ఇవ్వకుండా అభ్యర్థిని నిలబెట్టిన కాంగ్రెస్‌ కుటిల రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. ఎక్స్ అఫీషియో సభ్యులు హోదాలో సూర్యాపేటలోని పోలింగ్ కేంద్రంలో మంత్రి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి విజయం సాధిస్తారని స్పష్టం చేశారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, ఇతర పార్టీల సభ్యులు కూడా టీఆర్ఎస్ వైపు నిలవడం శుభపరిణామం అన్నారు. సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని పార్టీలకతీతంగా ఓటేసిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయ ఆధారితమైన నల్లగొండ జిల్లా కేసీఆర్ పాలనలో ఎంత ససశ్యామలం అయిందో స్థానిక ప్రజాప్రతినిధులు గుర్తించారని చెప్పారు. ఉహించనంత మెజార్టీతో కోటిరెడ్డి గెలవ బోతున్నారని జోస్యం చెప్పారు. నల్లగొండ జిల్లా తమకు కంచుకోట అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నేతలకు ఈ ఎన్నికల్లోనూ ఆశాభంగం తప్పదన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat