Home / CRIME / శిల్పాచౌదరి కేసులో కొత్త ట్విస్ట్

శిల్పాచౌదరి కేసులో కొత్త ట్విస్ట్

సినీ రాజకీయ ప్రముఖులను మోసం చేసి సంచలనం సృష్టించిన శిల్పాచౌదరి కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. దివోనాస్‌ పేరుతో శిల్ప లేడీ క్లబ్‌ నిర్వహించినట్టు తెలుస్తోంది. సిగ్నేచర్‌ విల్లా కేంద్రంగా కిట్టీ పార్టీలు పెట్టారు.

క్లబ్‌హౌస్‌లో కిట్టీ పార్టీలు నిర్వహించారు. కిట్టీ పార్టీల ఆహ్వానానికి శిల్ప స్పెషల్‌ ఆఫర్స్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. కిట్టీ పార్టీల ముసుగులో పేకాట, స్పా, వీకెండ్‌ పార్టీలు నిర్వహించారు. సంపన్న మహిళలతో మూడు వాట్సాప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేశారు. కస్టడీలో పోలీసులతో శిల్పాచౌదరి వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది.