ఏపీలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో 8 సూచికల ఆధారంగా ర్యాంకింగ్ ఇచ్చారు. ఈ విభాగంలో 0.634 స్కోరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవగా, 0.413 స్కోరుతో తెలంగాణ 7వ స్థానంలో నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాల వార్షిక వృద్ధి రేటు 2019లో 6.3% ఉండగా 2021లో 11.3%కి చేరింది. ఉద్యాన విభాగంలో ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు 4.7%నుంచి 12.3%కి పెరిగింది. పాల ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు 1.4% నుంచి 11.7%కి పెరిగింది.