తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అమూల్ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా బేకరీ తయారీ ప్లాంటును అమూల్ సంస్థ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది.
ప్లాంటు నిర్మాణానికి మొదటి దశలో రూ. 300 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్న అమూల్.. రెండో దశలో మరో రూ.200 కోట్లు ఖర్చు చేయనుంది. కాగా రాష్ట్రానికి అమూల్ సంస్థ రావడం గర్వకారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఆ సంస్థ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.