ఏపీలో నూతన సంవత్సరం సందర్భంగా మద్యం దుకాణాలు, బార్ల సమయాన్ని ప్రభుత్వం పొడిగించింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు తెరిచి ఉంచేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది.
సాధారణంగా బార్లు ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు తెరిచి ఉంటాయి. ఇవాళ ఒక్క రోజు గంట సమయం పెంచారు. అలాగే మద్యం దుకాణాలు రాత్రి 9 గంటలకే మూసేయాల్సి ఉండగా 10 గంటల వరకు తెరిచి ఉంచేందుకు పర్మిషన్ ఇచ్చారు.