సహజంగా మన మెదడు పనితీరు నెమ్మదిస్తే కొన్నిసార్లు మతిమరుపు, ఆలోచనల్లో తడబాటు వంటి సమస్యలు పెరుగుతాయి. వయసు, పౌష్టికాహారలోపం కూడా కొన్నిసార్లు ఇందుకు కారణమే. ఈ ఇబ్బందులను అధిగమించాలంటే స్ట్రాబెర్రీ, నారింజ మొదలైన పండ్లు తినాలి. వీటిలో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే.. మిరియాలు, బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, చెర్రీ పండ్లలో ఉండే పోషకాలు మెదడు పనితీరు మెరుగుపరుస్తాయి.
