తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఉగ్ర ముప్పు ఉందన్న హెచ్చరికలతో.. హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో నాంపల్లి పార్టీ కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే అప్రమత్తం చేయాలని కార్యాలయం సిబ్బందికి పోలీసులు సూచించారు. జనవరి 26 వరకు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి సమయంలో గస్తీని ముమ్మరం చేయాలని ఉన్నతాధికారులు పోలీసు సిబ్బందిని ఆదేశించారు
