మన శరీరానికి కావాల్సిన ముఖ్య పోషకాలలో విటమిన్ డి ఒకటి. ఎండలో గడపడం ద్వారా విటమిన్ డి లభిస్తుంది. వైద్యుల సూచన మేరకు కొందరు ఇమ్యూనిటీకి, శరీర దృఢత్వానికి సప్లిమెంట్ రూపంలో తీసుకుంటున్నారు.
అయితే విటమిన్ డి ఎక్కువ కావడం వల్ల ప్రమాదమే అంటున్నారు నిపుణులు. ఒళ్లు నొప్పులు, కండరాలు బలహీనంగా మారడం, ఎముకల్లో నొప్పి, పెళుసుతనం, కిడ్నీలు చెడిపోవడం, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయంటున్నారు.