అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి డా.మర్రి చెన్నారెడ్డి మనవడు, మర్రి ఆదిత్యరెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత కొన్నేళ్లుగా మర్రి చెన్నారెడ్డి ఫౌండేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మర్రి ఆదిత్యరెడ్డి, తాజాగా పూర్తి స్థాయి ప్రజాజీవితంలోకి ప్రవేశించారు.
రైతులు ఆదాయం పెంచడం, యువత, మహిళలు, చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం వంటి అనేక కార్యక్రమాలను ఫౌండేషన్ ద్వారా నిర్వహించారు. కరోనా సమయంలో అనేకమందికి సహాయం అందించారు. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి బాటలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.