పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘భీమ్లానాయక్’. మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కిది అఫీషియల్ రీమేక్. త్రివిక్రమ్ స్ర్కీన్ ప్లే డైలాగ్స్ అందిస్తుండగా.. తమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాను ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకూ విడుదలైన ఈ సినిమా టీజర్స్, సింగిల్స్ కు విపరీతమైన రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకి మరో అదనపు ఆకర్షణను జోడిస్తున్నట్టు తమన్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించాడు.
తను, రామజోగయ్య శాస్త్రి, త్రివిక్రమ్, కైలాష్ ఖేర్ దిగిన ఫోటోను షేర్ చేశాడు తమన్. భీమ్లానాయక్’ చిత్రంలో కైలాష్ ఖేర్ ఓ అద్బుతమైన పాటను పాడబోతున్నాడట. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ గీతం సినిమాకే హైలైట్ కానుందని సమాచారం. గతంలో కైలాష్ ఖేర్ పాడిన పాటలు ఆయా సినిమాలకే హైలైట్ గా నిలిచిపోయాయి. ఈ పాట భీమ్లానాయక్ చిత్రానికి సిగ్నేచర్ లా నిలిచిపోతుందని చెబుతున్నారు. మరి ఈ పాటను ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి.