బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్ తో ప్రేమలో ఉన్న సొట్ట బుగ్గల సుందరి .. అందాల రాక్షసి .. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన అందాలతో మత్తెక్కించిన తాప్సీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది.
వీరి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు ఓకే చెప్పి, ముహూర్తాన్ని నిర్ణయించినట్లు సమాచారం. అతి త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందట. ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన తాప్సీ బాలీవుడ్లోనూ సత్తా చాటుతోంది. చాలా కాలం తర్వాత మిషన్ ఇంపాజిబుల్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.