Site icon Dharuvu

రష్యాకు సామ్‌సంగ్‌ షాక్

ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో బహుజాతి సంస్థలు ఒక్కొక్కటిగా రష్యాలో తమ సేవలను నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే యాపిల్‌, నైక్‌, ఐకియా, యూటూబ్, ఫేస్‌బుక్‌ వంటి సంస్థలు రష్యాలో తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయగా, తాజాగా సామ్‌సంగ్‌ (Samsung) కూడా ఆ జాబితాలో చేరింది.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశానికి ఫోన్లు, చిప్‌ల సరఫరాను నిలిపివేసినట్లు ప్రకటించింది సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రకటించింది. పరిస్థితులను బట్టి తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటామని స్పష్టం చేసింది. మరోవైపు యుద్ధభూమి ఉక్రెయిన్‌కు 6 మిలియన్ డాలర్ల మానవతా సాయం అందిస్తున్నట్లు వెల్లడించింది.

Exit mobile version