Breaking News
Home / ANDHRAPRADESH / మూడు రాజ‌ధానులు మా విధానం.. దానికే క‌ట్టుబ‌డి ఉన్నాం: బొత్స స‌త్య‌నారాయ‌ణ
botsa satyanarayana comments on amavaravathi 3 capitals.dharuvu tv

మూడు రాజ‌ధానులు మా విధానం.. దానికే క‌ట్టుబ‌డి ఉన్నాం: బొత్స స‌త్య‌నారాయ‌ణ

అమ‌రావ‌తి: ఏపీలో మూడు రాజ‌ధానుల‌కే తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని రాష్ట్ర మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మ‌రోసారి తేల్చి చెప్పారు. అమ‌రావ‌తిలో మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ మూడు రాజ‌ధానులు త‌మ ప్ర‌భుత్వ విధాన‌మ‌ని చెప్పారు. ఈ విష‌యంలో టీడీపీ నేత‌ల వ్యాఖ్య‌లు త‌మ‌కు ప్రామాణికం కాద‌న్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ స‌మావేశాల్లో రాజ‌ధానుల‌ అంశంపై బిల్లు పెట్టే అంశాన్ని ప‌రిశీలిస్తున్నామ‌ని తెలిపారు. ఇటీవ‌ల ఏపీ ఉన్న‌త న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పు నేప‌థ్యంలో మంత్రి మ‌రోసారి స్పందించారు.

మ‌రోవైపు రాష్ట్రంలో జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌పై వ‌స్తోన్న విన‌తుల‌ను పరిశీలిస్తున్నామ‌ని.. వాటిపై ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని బొత్స చెప్పారు. ఉగాది త‌ర్వాత నుంచి కొత్త జిల్లాల్లో పాల‌న మొద‌లుపెట్టేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు మంత్రి వివ‌రించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino