ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఓం బిర్లాకు అందించారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
కర్హల్ నియోజకవర్గం నుంచి ఆయన విక్టరీ కొట్టన విషయం తెలిసిందే. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆజామ్ఘర్ ఎంపీగా అఖిలేశ్ ఎన్నికయ్యారు. ఎంపీగా రాజీనామా చేసిన అఖిలేశ్ ఇక నుంచి యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ను అసెంబ్లీలో ఢీకొట్టనున్నారు. 403 స్థానాలు ఉన్న యూపీలో .. అఖిలేశ్ పార్టీ 111 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ ఒంటరిగా 255 సీట్లు కైవసం చేసుకున్నది.