ఉమ్మడి ఏపీ అఖరి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సొంతూరు చిత్తూరు జిల్లా కలికిరిలోని సొంతింటికి వెళ్లక ఐదేళ్లు అవుతోందట. ఇందుకు కారణం ఆయన సొంత తమ్ముడు నల్లారి కిషోర్. 2019లో పీలేరు నుంచే ఏపీ ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం తరఫున పోటీ చేసిన సీఎం సోదరుడు ఆ తర్వాత అదే పార్టీలో జాతీయ నేతగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ జెండా కప్పుకుని టీడీపీ నేత ఉన్న ఇంటికి వెళ్లలేక ఊరికి వచ్చినా R&B గెస్ట్ హౌజ్లో కిరణ్ కుమార్ రెడ్డి బస చేస్తున్నారట.
