తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో వివిధ వర్గాలకు అందజేసే భోజన ఛార్జీలను పెంచుతూ తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది. రోగులందరికీ, అలాగే గిరిజన రోగుల సహాయకులకు అందజేసే భోజన ఛార్జీ ప్రస్తుతం రూ.40 ఉండగా, దాన్ని రూ.80కి పెంచారు. TB, మానసిక రోగులు, థెరపాటిక్ రోగులకు ప్రస్తుతం రూ.56 ఇస్తుండగా, దాన్ని రూ. 112కి పెంచారు. ఇక డ్యూటీ డాక్టర్లకు రూ. 80 నుంచి రూ.160కి పెంచారు.
