Breaking News
Home / MOVIES / ప్రభాస్ అభిమానులకు శుభవార్త

ప్రభాస్ అభిమానులకు శుభవార్త

పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇటీవల వచ్చిన రాథే శ్యామ్ మంచి హిట్ టాక్ తో మంచి కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి విదితమే. తాజాగా ప్రభాస్ రామాయణ ఇతిహాసం ఆధారంగా ఓం రౌత్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆది పురుష్ చిత్రంలో నటిస్తున్నాడు.

ఇందులో డార్లింగ్ రాముడి పాత్రలో ..జానకిగా కృతిసనన్ నటిస్తున్నారు. మరోవైపు లంకేశ్వరుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర పనులను శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రాన్ని వచ్చేడాది జనవరి పన్నెండో తారీఖున సంక్రాంతి కానుకగా సినీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

అయితే ఈ సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ ఉంటుంది. అందుకు సంబంధించి ఓం రౌత్ ప్రణాళికలు రచిస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇందుకు సంబంధించిన విషయాన్ని హీరో ప్రభాస్ కు చెబితే గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్లు ఆ వార్తల సారాంశం . ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సలార్,ప్రాజెక్ట్ కె ,స్పిరిట్  చిత్రాలతో పాటు మారుతి దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్నారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri