Home / ANDHRAPRADESH / ఏపీలో మళ్లీ 5 మంది డిప్యూటీ సీఎంలు.. మంత్రుల శాఖలివే..

ఏపీలో మళ్లీ 5 మంది డిప్యూటీ సీఎంలు.. మంత్రుల శాఖలివే..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కేబినెట్‌ కొలువుదీరింది. నూతన మంత్రులుగా 25 మంది ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ వారితో ప్రమాణం చేయించారు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రులకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శాఖలను కేటాయించారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఐదుగురికి డిప్యూటీ సీఎం హోదా కల్పించారు.

పీడిక రాజన్నదొర, బూడి ముత్యాల నాయుడు, కొట్టు సత్యనారాయణ,అంజాద్‌ బాషా, నారాయణస్వామికి డిప్యూటీ సీఎం పదవులు వరించాయి. నారాయణస్వామి గత మంత్రివర్గంలోనూ డిప్యూటీ సీఎంగా పనిచేశారు.

మంత్రులు- కేటాయించిన శాఖలు

పీడిక రాజన్న దొర- డిప్యూటీ సీఎం, ట్రైబల్‌ వెల్ఫేర్‌
బూడి ముత్యాలనాయుడు- డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌
అంజాద్‌ బాషా- డిప్యూటీ సీఎం, మైనారిటీ సంక్షేమం
కొట్టు సత్యనారాయణ – డిప్యూటీ సీఎం, ఎండోమెంట్‌
కె.నారాయణ స్వామి- డిప్యూటీ సీఎం, ఎక్సైజ్‌
ధర్మాన ప్రసాదరావు – రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు
సీదిరి అప్పలరాజు – పశుసంవర్ధక, మత్స్యశాఖ
బొత్స సత్యనారాయణ- విద్యాశాఖ
గుడివాడ అమర్నాథ్‌ – పరిశ్రమలు, ఐటీ శాఖ
దాడిశెట్టి రాజా – రహదారులు, భవనాల శాఖ
వేణుగోపాల్‌ – బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, సమాచార పౌరసంబంధాల శాఖ
తానేటి వనిత – హోం శాఖ
జోగి రమేష్‌ – గృహనిర్మాణ శాఖ
కారుమూరి నాగేశ్వరరావు – పౌర సరఫరాల శాఖ
మేరుగ నాగార్జున – సాంఘిక సంక్షేమ శాఖ
అంబటి రాంబాబు- జలవనరుల శాఖ
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి- గనులు, అటవీ, ఇంధన, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
బుగ్గన రాజేంద్రనాథ్‌- ఆర్థిక, శాసనసభ వ్యవహారాలు, ప్రణాళిక శాఖ
ఆదిమూలపు సురేశ్‌- పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ
కాకాణి గోవర్ధన్‌ రెడ్డి- వ్యవసాయం, సహకార, మార్కెటింగ్‌ శాఖలు
ఆర్‌కే రోజా- పర్యాటక, యువజన, క్రీడల శాఖ
ఉషశ్రీ చరణ్‌- మహిళా శిశుసంక్షేమశాఖ
పినిపే విశ్వరూప్ – రవాణాశాఖ
విడదల రజని – వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
గుమ్మనూరు జయరాం- కార్మిక శాఖ

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat