ఆదివారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండర్ ప్రదర్శనతో హైదరాబాద్ సన్ రైజర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి విధితమే. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ మొత్తం ఇరవై ఓవర్లలో నూట యాబై ఒక్క పరుగులకు ఆలౌటైంది.పంజాబ్ బ్యాటర్స్ లో లివింగ్ స్టోన్ ముప్పై మూడు బంతుల్లో అరవై పరుగుల(5*4,4*6)తో రాణించగా షారూక్ ఖాన్ ఇరవై ఆరు పరుగులతో పర్వాలేదన్పించాడు.
హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ నాలుగు వికెట్లను పడగొట్టగా భువనేశ్వర్ మూడు వికెట్లను దక్కించుకున్నాడు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన హైదరాబాద్ 18.5ఓవర్లలో మూడు వికెట్లను కోల్పోయి 152పరుగులను చేధించింది. అయితే హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ ఖాన్ తన లాస్ట్ ఓవర్ లో రనౌట్ తో సహా నాలుగు వికెట్లను వరుసగా పడగొట్టి పంజాబ్ ను చావుదెబ్బ కొట్టాడు.
ఉమ్రాన్ ఖాన్ ఓవర్ గురించి మంత్రి కేటీఆర్ తన ఫేస్ బుక్ ఫేజీ వేదికగా స్పందిస్తూ ఓ పోస్టు చేశాడు. ఆ ట్వీట్ లో మెరుపువేగంతో అభిమానులను అలరిస్తున్న ఉమ్రాన్ ఖాన్ ది అది నమ్మశక్యం కాని స్పెల్ . బహుశా ఐపీఎల్ లో ఇదే ఉత్తమ ఓవర్ కావచ్చు . నా అభినందనలు అందుకో యువకుడా అంటూ ఆయన పోస్టు చేశాడు.