తనకు కాబోయే భర్త అని కూడా చూడకుండా ఓ వ్యక్తిని లేడీ ఎస్సై అరెస్ట్ చేసేసింది. ఈ ఘటన అస్సాంలోని నాగాన్ జిల్లాలో చోటుచేసుకుంది. రాణా పొగాగ్ అనే వ్యక్తి ఓఎన్‌జీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ చాలా మందిని మోసం చేశాడు. జున్మోణి అనే యువతి ఎస్సైగా పనిచేస్తోంది. రరాణా పొగాగ్ అనే వ్యక్తికి ఆమెతో ఎంగేజ్‌మెంట్ అయింది.
అయితే ఆమె ఎస్సైగా పనిచేస్తున్న చోటే అతడిపై కేసు నమోదైంది. రూ.కోట్లలో డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో తేలడంతో ఆయన్ను ఎస్సై జున్మోణి అరెస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఎస్సై మీడియాతో మాట్లాడుతూ పెద్ద మోసగాడి బారి నుంచి తన జీవితం బయటపడినందుకు సంతోషంగా ఉందని.. అతడి నిజస్వరూపం గురించి సమాచారం ఇచ్చిన ముగ్గురు వ్యక్తులకు ఆమె థాంక్స్ చెప్పింది.