జగన్ రాజకీయాల్లో లేకపోతే ఇళ్ల కోసం పేదల ప్రజలు అల్లాడిపోయేవారని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. జగన్ కోసం పేద ప్రజలంతా ఒకే వేదికపైకి రావాలని పిలుపునిచ్చారు. గుడివాడలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నాని మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదన్నారు. తన నియోజకవర్గంలో తనకు ఇల్లు లేదని ఏ ఒక్క పేదవాడు అడిగినా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో తమ 151 సీట్లు మళ్లీ వస్తాయని.. మిగిలిన సీట్ల కోసమే ప్రతిపక్షాలకు కొట్టుకోవాలని కొడాలి నాని వ్యాఖ్యానించారు. పవన్, చంద్రబాబు కలిసి పోటీ చేసినా.. విడివిడిగా చేసినా తమకు నష్టమేమీ లేదన్నారు.