Home / MOVIES / మహేష్ బాబుకు అండగా కంగన రనౌత్

మహేష్ బాబుకు అండగా కంగన రనౌత్

Bollywood Hot Beauty నిత్యం ఏదోక వార్తతో మీడియాలో సంచలనం సృష్టించే స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ తాజాగా నటించిన చిత్రం ‘ధాకడ్ (Dhaakad)’ త్వరలో విడుదల కానుంది. ఈ తరుణంలో ఈ మూవీకి సంబంధించిన రెండో ట్రైలర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంగన బాలీవుడ్ తనని తట్టుకోలేదనే మహేశ్ బాబు కామెంట్స్‌పై స్పందించింది.

కంగన మాట్లాడుతూ.. ‘అవును.. మహేశ్ అన్నది నిజమే. ఆయన్ని బాలీవుడ్ తట్టుకోలేదు. ఎందుకంటే ఆయన్ని బాలీవుడ్ నుంచి ఎంతోమంది సినిమా కోసం సంప్రదించారని నాకు తెలుసు. కానీ.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ దేశంలోనే నెంబర్ 1 ఇండస్ట్రీగా నిలిచింది.

కాబట్టి ఖచ్చితంగా ఆయనకి తగిన రెమ్యూనరేషన్‌ని బాలీవుడ్ ఇవ్వలేదు.ఇలాంటి చిన్న చిన్న విషయాలను ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారో నాకు తెలియట్లేదు. నిజం చెప్పాలంటే.. తన పరిశ్రమపై, ఆయన పనిపై గౌరవం చూపడం వల్లనే మహేశ్ ఈ స్థాయిలో ఉండగలిగాడు. దాన్ని మనం ఒప్పుకోవాలి. తెలుగు చిత్ర పరిశ్రమ గత 10, 15 ఏళ్లలో తమిళ పరిశ్రమతోపాటు ఇతర ఇండస్ట్రీలు అన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్లిపోయింది. కాబట్టి, వారి నుంచి మనం చాలా నేర్చుకోవాలి’ అంటూ చెప్పుకొచ్చింది.

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar