Site icon Dharuvu

అమిత్‌షా పర్యటన.. కేటీఆర్‌ బహిరంగ లేఖ

తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. రాష్ట్రంపై వివక్ష కొనసాగుతూనే ఉందని ఆరోపించారు. రేపు తెలంగాణలో కేంద్రహోంమంత్రి పర్యటన నేపథ్యంలో కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 8 ఏళ్లు గడిచినా తెలంగాణపై అదే వివక్ష కొనసాగిస్తున్నారని విమర్శించారు.

ఏపీ పునర్విభజన చట్టంలోని ఒక్కహామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. అమిత్‌షాకు చిత్తశుద్ధి ఉంటే దీనిపై రేపు జరిగే సభలో సమాధానం చెప్పాలని లేఖలో ఆయన పేర్కొన్నారు.

Exit mobile version