Home / POLITICS / అమిత్‌షాజీ.. వీటికి సమాధానం చెప్పగలరా?: కవిత ప్రశ్నల వర్షం

అమిత్‌షాజీ.. వీటికి సమాధానం చెప్పగలరా?: కవిత ప్రశ్నల వర్షం

కేంద్రంహోమంత్రి, బీజేపీ సీనియర్‌నేత అమిత్‌షా తెలంగాణ పర్యటన సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పలు ప్రశ్నలు సంధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగింపు సభ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరగనుంది. ఈ సభకు అమిత్‌షా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అమిత్‌షా సమాధానం చెప్పాలంటూ ట్విటర్‌ వేదికగా కకవిత ప్రశ్నల వర్షం కురిపించారు.

వెనుకబడిన ప్రాంతాల కింద తెలంగాణకు రావాల్సిన రూ.1,350 కోట్లు, జీఎస్టీ పరిహారం రూ.2,247 కోట్ల సంగతేంటని కవిత ప్రశ్నించారు. ఆర్థిక సంఘం నిధుల కింద రాష్ట్రానికి రావాలసిన రూ.3వేలకోట్లకు పైగా బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని నిలదీశారు. వీటితో పాటు మరికొన్ని ప్రశ్నలను ఆమె సంధించారు.

ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్భణానికి ఏం సమాధానం చెబుతారు?

మిషన్‌ కాకతీయ మిషన్‌ భగీరథకు రూ.24వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫార్సు చేస్తే కేంద్రం ఎందుకు విస్మరించింది?

గత 8 ఏళ్లలో తెలంగాణకు ఒక్క ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్‌, ట్రిపుల్‌ ఐటీ, మెడికల్‌ కాలేజ్‌, నవోదయ స్కూల్స్‌ ఎందుకు ఇవ్వలేదు?

దీనిపై నేటి సభలో ప్రజలకు సమాధానం చెప్పగలరా?

కర్ణాటకలోని అప్పర్‌ భద్ర, కెన్‌ బెత్వా ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించి.. పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు ఇవ్వకపోవడం కేంద్ర ప్రభుత్వ కపటత్వం కాదా?

బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగిన నిరుద్యోగం, మత అల్లర్లపై మీ ఆన్సర్‌ ఏంటి?

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat