Breaking News
Home / POLITICS / తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ: పవన్‌

తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ: పవన్‌

రానున్న ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మృతిచెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించి ఆర్థికసాయం అందించారు. వలిగొండ మండలం గోకారం, కోదాడలో కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా కోదాడలో మీడియాతో పవన్‌ మాట్లాడారు.

తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో జనసేనకు 5వేలకు పైగా ఓట్లు ఉన్నాయన్నారు. ఆ ఓట్లతో గెలవలేనప్పటికీ రాజకీయాలపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ, గ్రామాల్లోను కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పవన్‌ చెప్పారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum