Home / EDITORIAL / బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదు-EDITORIAL

బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదు-EDITORIAL

మహమ్మద్‌ ప్రవక్తను తూలనాడుతూ బీజేపీ బహిష్కృత నేతలు నూపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ చేసిన హేయమైన వ్యాఖ్యలపై అంతర్జాతీయ సమాజం దుమ్మెత్తిపోస్తున్నది. మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై ముస్లిం దేశాలు భగ్గుమంటున్నాయి. సర్వత్రా విమర్శలు రావడంతో ఇకచేసేదేమీ లేదన్నట్టు ఆ నేతలను సస్పెండ్‌ చేసిన కమలదళం.. ఆ తర్వాత ఇదంత పెద్ద విషయమే కాదన్నట్టు కవరింగ్‌ చేసే ప్రయత్నం చేస్తున్నది. అయితే, బీజేపీ విద్వేష రాజకీయాలను దేశంలోని ప్రధాన ఇంగ్లిష్‌ పత్రికలు తమ సంపాదకీయాల్లో తాజాగా ఎండగట్టాయి.

బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదు
ముస్లింల ఇండ్లను బల్డోజర్లతో కూల్చేయడం, సైద్ధాంతికంగా, రాజకీయపరంగా విమర్శించిన ప్రొఫెసర్లు, యూనివర్సిటీ విద్యార్థులపై దేశద్రోహ కేసులు బనాయించడం, హలాల్‌, నమాజ్‌, మసీద్‌-మందిరం.. ఇలా విద్వేషాలను రెచ్చగొట్టే ఇలాంటి ఘటనలే రైట్‌వింగ్‌ గ్రూపులు విచ్చలవిడిగా మాట్లాడటానికి అవకాశాన్ని ఇచ్చాయి. నూపుర్‌, జిందాల్‌ వ్యాఖ్యలు ఇలాంటి వాతావరణంలో నుంచి వచ్చినవే. ఈ ఘటనలు రానున్న ఎన్నికల్లో బీజేపీని మూల్యం చెల్లించుకునేలా చేస్తాయి. – టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా

దేశప్రయోజనాలకు ఎంత మాత్రం మంచిది కాదు
ముస్లిం జనాభాలో ప్రపంచంలో భారత్‌ది రెండోస్థానం. వారి ఓట్లు బీజేపీకి అవసరం లేదు. అయితే, ప్రజాస్వామ్య దేశంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉన్నది. ఒక మతాన్ని కించపరుస్తూ బీజేపీ నేతలు చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు దేశానికి ఎంతమాత్రం మంచిది కాదు. సొంత నేతలు విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నప్పటికీ ప్రధాని మోదీ, పార్టీ అధినేత నడ్డా ఉదాసీనతతో వ్యవహరిస్తున్నారు.
– ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌

బీజేపీకి గొప్ప గుణపాఠం
ఇతర మతాలను కించపరచడాన్ని బీజేపీ ప్రోత్సహిస్తున్నది. అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండిస్తూ ఓఐసీ ప్రకటన జారీచేస్తే, ఆ ప్రకటనపై కూడా మోదీ సర్కారు మండిపడింది. ఓఐసీ అలా ఎందుకు స్పందించాల్సి వచ్చిందో మాత్రం విస్మరిస్తున్నారు. మహమ్మద్‌ ప్రవక్తపై వ్యాఖ్యల దుమారం బీజేపీకి గొప్ప గుణపాఠం చెప్పిందని అనుకోవచ్చు. – డెక్కన్‌ హెరాల్డ్‌

ఆలస్యంగా మేల్కొన్నారు
బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు విద్వేషపూరితమైనవని స్పష్టంగా తెలుస్తున్నది. విమర్శలు రావడంతో వారిని బీజేపీ సర్కారు సస్పెండ్‌ చేసింది. విద్వేష వ్యాఖ్యలపై ఇదో బలమైన ముందడుగు. అయితే, వ్యాఖ్యలు చేశాక, దానిపై సర్వత్రా విమర్శలు వచ్చాక.. అధికార బీజేపీ తీరిగ్గా మేల్కొన్నది. సదరు వ్యాఖ్యలు చేసిన నేతలపై తీసుకున్న చర్యలు చాలా ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఎందుకు? – ది హిందూ

మేకిన్‌ ఇండియా.. హేట్‌ ఇన్‌ ఇండియాగా మారింది
విద్వేష వ్యాఖ్యలు చేసిన వారిని సస్పెండ్‌ చేయగానే సమస్య సద్దుమణిగినట్టు బీజేపీ భావిస్తున్నది. అయితే, ఇది వాస్తవం కాదు. ఇంతకాలం భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించిన పశ్చిమాసియా దేశాలు ఇకపై అలా ఉండకపోవచ్చు. మతోన్మాదం అనే విషాన్ని చిమ్ముతూ, సొంత నేతలే బీజేపీని భ్రష్టుపట్టిస్తున్నారు. మోదీ తీసుకొచ్చిన ‘మేకిన్‌ ఇండియా’ నినాదం.. ‘హేట్‌ ఇన్‌ ఇండియా’గా మారింది. – ది టెలిగ్రాఫ్‌

యావత్తు జాతికి అవమానం
‘భారతీయులను సిగ్గుతో తలవంచుకునేలా ఏనాడూ చేయలేదు’ అం టూ అధికారంలోకి వచ్చి ఎనిమిదేైండ్లెన సందర్భంగా ప్రధాని మోదీ ఇటీవలే గొప్పగా ప్రకటించారు. అయితే, ఆయన పార్టీ నేతల వల్లే అంతర్జాతీయ సమాజం ముందు యావత్తు జాతి సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. బతుకుదెరువు కోసం గల్ఫ్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌లోని దేశాలకు వెళ్లిన భారతీయులు అక్కడి వారికి క్షమాపణలు చెప్పుకోవాల్సిన దుర్గతి దాపురించింది. ఇది ముమ్మాటికీ బీజేపీ వల్లే.
– ది ట్రిబ్యూన్‌

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri