Site icon Dharuvu

మిగతా వాళ్లకీ బూస్టర్‌ డోసు ఇవ్వండి: కేంద్రాన్ని కోరిన మంత్రి హరీష్‌

18 ఏళ్లు నిండిన వారందరికీ గవర్నమెంట్‌ హాస్పిటళ్లలో బూస్టర్‌ డోస్‌ ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హరీష్‌ మాట్లాడారు.

ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్స్ బీఏ.4, బీఏ.5 కేసులు పెరుగుతున్నందన అర్హులైన వారంద‌రికీ బూస్ట‌ర్ డోస్ ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్‌ హాస్పిటళ్లలో సాధ్యమైనంత వరకు కొవిడ్‌ ర్యాపిడ్‌ టెస్టులు, ఆర్టీపీసీఆర్‌ టెస్టులు పెంచుతున్నామని వివరించారు. అయితే 60 ఏళ్లు దాటిన వారికి మాత్ర‌మే ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో బూస్ట‌ర్ డోసు ఇచ్చారు. మిగ‌తా వారికి బూస్ట‌ర్ డోసు ఇచ్చేందుకు ఇది స‌రైన స‌మ‌యం అని హ‌రీశ్‌రావు అన్నారు

Exit mobile version