కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని భోళాశంకర్ నగర్ లో రూ.1.35 కోట్లతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు, భూగర్భ డ్రైనేజీని ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి గారితో కలిసి ప్రారంభించారు. అనంతరం కాలనీ వాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కాలనీలను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం అన్నారు.
గౌరవ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి సహకారంతో అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో కొత్తగా ఏర్పాటైన ప్రతీ బస్తీ, కాలనీల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి త్వరలోనే కోట్ల రూపాయలతో ఫ్లై ఓవర్ లు నిర్మించుకోబోతున్నామని అన్నారు.
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చే దిశగా తమ ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ కృష్ణ చైతన్య, ప్రెసిడెంట్ నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ మధు సుధన్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ సి.నారాయణ, అడ్వైజర్లు పి.శ్రీనివాస్, భిక్షపతి గౌడ్, నాగప్ప, వెంకటేష్, సీనియర్ సిటిజెన్స్ మల్లేష్, మురళి, నాగేష్, కనకాచారి, అరుణ రెడ్డి, యేసు బాబు, మురళి, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్, జే.శేకర్, నర్సింహా, లక్ష్మారెడ్డి, ప్రవీణ్ పంతులు తదితరులు పాల్గొన్నారు.