కేంద్రంలో మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన అగ్నిపథ్ ఆందోళనల సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఆందోళనలో ఆర్మీ అభ్యర్థులు పలు రైళ్లకు నిప్పు పెట్టిన సందర్భంలో పెను ప్రమాదం తప్పింది.
ప్లాట్ ఫామ్ పై నం-1పై ఉన్న రైలు బోగీకి నిప్పంటించగా దానికి అతిసమీపంలోనే రైళ్లలో నింపే డీజిల్ ట్యాంక్ ఉంది. ఘటన సమయంలో అందులో 20వేల లీటర్ల డీజిల్ ఉంది. దానికి మంటలు అంటుకుని ఉంటే భారీ విస్ఫోటనం సంభవించేది. పోలీసులు కాల్పులు జరపడంతో అభ్యర్థులు అక్కడి నుంచి పరుగులు తీశారు.