Home / POLITICS / కొల్లాపూర్‌లో సై అంటే సై.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అరెస్ట్‌

కొల్లాపూర్‌లో సై అంటే సై.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అరెస్ట్‌

కొల్లపూర్‌కి చెందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చకు వెళ్తుండగా పోలీసులు హర్షవర్ధన్‌రెడ్డిని అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. దీంతో కొల్లాపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

కొల్లపూర్‌నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌పార్టీలో రెండు వర్గాలున్నాయి. ఒకటి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుది కాగా.. మరొకటి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిది. గత కొంతకాలంగా ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. కొల్లాపూర్‌ అభివృద్ధిపై ఓ వైపు జూపల్లి, మరోవైపు బీరం హర్షవర్ధన్‌రెడ్డి పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో బహిరంగ చర్చకు పోలీసులను రెండు వర్గాలు అనుమతి కోరాయి. దీనికి పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ రెండు వర్గాలు సై అంటే సై అనేలా పట్టుదలతో ఉన్నాయి. ఈ క్రమంలో కొల్లపూర్‌లో నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. నేతల ఇళ్లకు వెళ్లే మార్గాల్లో ఇతరును పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar