ఒక పక్క యాంకర్‌గా మరోవైపు బుల్లి తెరను, ఇంకోవైపు సిల్వర్ స్క్రీన్ పై నటీమణిగా అటు వెండితెరను బ్యాలెన్స్ చేయడం హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ కే చెల్లింది. తాజాగా తాను ఓ మంచి పాత్ర పోషించినట్లు చెప్పుకుంటున్న ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ మూవీ సిద్ధమవుతుంది.
అంతేకాకుండా మరోవైపు మెగాస్టార్ ‘గాడ్‌ఫాదర్’ చిత్రంలో కథను మలుపుతిప్పే ఓ కీలక పాత్ర చేస్తోందని టాక్. త్వరలో ‘పుష్ప 2’ చిత్రం షూటింగ్ కోసం ఈ హాట్ యాంకర్ సిద్ధంగా ఉంది. అయితే ఇప్పటివరకు నటించిన పాత్రలకు కంటే భిన్నంగా అనసూయ ఒక సినిమాలో వేశ్య పాత్ర పోషిస్తున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి.
ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి త్వరలో గురజాడ అప్పారావు రచించిన ‘కన్యాశుల్కం’ నాటకాన్ని వెబ్ సిరీస్ గా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నట్టు టాక్. ఇందులో మధురవాణిగా అనసూయను ఎంపిక చేశాడట క్రిష్. ఆ పాత్రకోసం ఎంతో మందిని అనుకున్నారట. అయితే ఫైనల్ గా అనసూయను ఎంపికచేశారట. అది మంచి పాత్ర కావడంలో అనసూయ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.చూడాలి మరి ఈ పాత్రలో అనసూయ ఎలా నటించబోతుందో..?
Post Views: 550