తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్‌రాజు కన్నుమూశారు. ఆయన గత కొంకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హైదరాబాద్‌లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ నగరంలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ ఆయన నిన్న మంగళవారం ఉదయం డిశ్చార్జీ అయ్యారు. అయితే ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటలకు మరణించారు.
ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అతని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఉత్తమ ఎడిటర్‌గా నంది అవార్డు అందుకున్న ఆయన చట్టానికి కళ్లు లేవు సినిమాతో ఎడిటింగ్ ప్రారంభించారు. మొత్తం ఎనిమిది భాషల్లో 8 వందలకుపైగా సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశారు.
ఖైదీ నెంబర్ 150, గబ్బర్‌సింగ్, కిక్, అదుర్స్, ఊసరవెల్లి, బద్రీనాథ్, బలుపు, గోపాల గోపాల, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, నాయక్, రేసుగుర్రం, అల్లుడు శీను, పవర్, బెంగాల్ టైగర్, సౌఖ్యం, డిక్టేటర్, అఖిల్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, కాటమరాయుడు, సర్దార్ గబ్బర్‌సింగ్, విన్నర్, హైపర్, గౌతమ్‌నంద, టచ్ చేసి చూడు, పటేల్, ఇంటెలిజెంట్, సన్నాఫ్ ఇండియా, మోసగాళ్లు, రాజుగారి గది 3, లయన్, స్పీడున్నోడు, కిక్ 2, పిల్లా నువ్వు లేని జీవితం వంటి చిత్రాలకు ఎడిటర్‌గా ఆయన పనిచేశారు.