ఏపీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులు నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో మాట్లాడిన పలువురు నేతలు మూడు రాజధానుల బిల్లు తీసుకొస్తామని చెప్పారు.
రాజధాని వికేంద్రీకరణ జరగాలని.. అభివృద్ధి అన్ని ప్రాంతాలకూ విస్తరించాలని ఆకాంక్షించారు. ‘పరిపాలన వికేంద్రీకరణ’పై ప్రవేశపెట్టిన తీర్మానంపై నేతలు మాట్లాడారు. రాష్ట్రం బాగుండాలంటే మూడు రాజధానులు ఉండాలని.. మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందాలని ఎంపీ నందిగం సురేష్ అభిప్రాయపడ్డారు.