ఏపీ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ అవినీతిపై ఈడీ విచారణ చేయాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ నేత వర్ల రామయ్య కోరారు. ‘గత నెలలో కొన్ని బదిలీలకు సంబంధించి మంత్రి జయరామ్ చెప్పారు..అందుకే జాయింట్ కమిషనర్ శ్రీనివాస్ ప్రత్యేకంగా జీవో ఇచ్చారు. ఇందులో మంత్రి సొంత మనుషులను వారు కోరుకున్న చోటుకు బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో రూ. లక్షల్లో నగదు చేతులు మారింది. దీనిపై సీఎం జగన్, సజ్జల సమాధానం చెప్పాలి’ అని వర్ల ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
