Home / MOVIES / బింబిసార హిట్టా..? ఫట్టా..?-Review

బింబిసార హిట్టా..? ఫట్టా..?-Review

ఇటీవల  కాలంలో ట్రైలర్ తో ఆసక్తి కలిగించిన సినిమా బింబిసార. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని రూపొందించారు. టైమ్ ట్రావెల్ కథను జానపద తరహాలో చూపిస్తూ తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ లో ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే:

క్రీస్తు శకం 500వ సంవత్సరంలో త్రిగర్తల సామ్రాజ్యాన్ని బింబిసారుడు (కళ్యాణ్ రామ్) పరిపాలిస్తుంటాడు. వీరత్వంతో పక్క రాజ్యాలను ఆక్రమించుకుంటూ తన రాజ్యాన్ని విస్తరించుకుంటాడు. తిరగ‌బడిన అస్మిక రాజ్య యువరాణి ఐరా (కేథరీన్ ట్రెసా)ను అంత:పురంలో బంధిస్తాడు. సోదురుడు దేవ దత్తుడు(కళ్యాణ్ రామ్)ని రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు. బింబిసారుడి క్రూరత్వాన్ని ప్రజలు భరించలేకపోతారు. శత్రువులకు వైద్య సహాయం అందించిన కారణంగా ధన్వంతరీపురంపై బింబిసారుడు చేసిన దాడిలో ఓ పాప చనిపోతుంది. ప్రస్తుత కాలంలో వైద్యుడు సుబ్రహ్మణ్య శర్మ (వివాన్ భటేనా), మాంత్రికుడు కేతు ( రవిశంకర్) సహాయంతో బింబిసారుడి నిధిని, ధన్వంతరీ గ్రంథాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. దేవదత్తుడితో బింబిసారుడు పోరు చేస్తుండగా ఓ మాయ దర్పణంలో పడి ఈకాలానికి వస్తాడు. తనకు పరిచయం లేని కాలంలో బింబిసారుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు. ఈ కష్టాలు అతని స్వభావంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చాయి. ఆ కాలంలో ధన్వంతరీపురంలో పాప విషయంలో తను చేసిన తప్పుకు వర్తమాన కాలంలో డాక్టర్ సుబ్రహ్మణ్య శర్మ నుంచి పాపను ఎలా కాపాడాడు అనేది మిగిలిన కథ.

ఫ్లస్ పాయింట్స్:

కళ్యాణ్ రామ్ నటన
ఆకట్టుకునే భావోద్వేగాలు
దర్శకత్వ ప్రతిభ
టైమ్ ట్రావెల్ ను ముడిపెట్టిన తీరు
కీరవాణి నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్:

ప్రారంభ సన్నివేశాలు
పాటలు

ఎలా ఉందంటే:

ఏ జానర్ సినిమా అయినా, ఎంత భారీ బడ్జెట్ మూవీ అయినా ఆ కథకు భావోద్వేగాలు ముఖ్యం. హాలీవుడ్ లో సూపర్ హీరో సినిమాలైనా, సైన్స్ ఫిక్షన్ చిత్రాలైనా ఈ ఎమోషన్స్‌నే నమ్ముకుంటాయి. బింబిసార టైమ్ ట్రావెల్ నేపథ్య చిత్రమైనా భావోద్వేగాల మీద ప్రయాణం చేసింది. రెండు కాలాల మధ్య ఓ పాప సెంటిమెంట్‌ను ముడిపెట్టిన తీరు మెప్పించింది. ప్రతి సందర్భంలో హీరోయిజం తగ్గకుండా దర్శకుడు వశిష్ఠ బింబిసార పాత్రను మలిచాడు. అతీంద్రియ శక్తులు, మంత్రగాళ్లు, దైవ శక్తి ఇవన్నింటికీ ముడిపెట్టి జానపద రీతిలో రక్తికట్టించాడు. సినిమా ప్రారంభంలో బింబిసారుడి క్రూరత్వాన్ని చూసిన ప్రేక్షకులు ఇబ్బంది పడినా ద్వితీయార్థంలో ఆ పాత్రలో వచ్చిన మార్పు, తప్పులను సరిచేసుకునే విధానం హీరో ఔచిత్యాన్ని కాపాడింది. బింబిసారుడు, దేవదత్తుడి పాత్రల్లో కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం మెప్పిస్తుంది. కళ్యాణ్ రామ్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న విజయం ఈ చిత్రంతో అతనికి దక్కింది అనుకోవచ్చు.

వర్తమాన కాలంలోకి బింబిసారుడు వచ్చిన తర్వాత ఇక్కడి ఆధునికత, పోకడలు చూసి అతను అయోమయానికి గురైన విధానం వినోదాన్ని అందించింది. ఇక్కడి నుంచే కథలోని సీరియస్‌నెస్ తగ్గి సరదాగా మారిపోతుంది. ప్రతి పాత్రకు, సందర్భానికి ముడిపెట్టుకుని రాసుకున్న స్క్రిప్ట్ తో దర్శకుడు వశిష్ట ప్రతిభ కనిపించింది. అతను ముందే చెప్పినట్లు లాజిక్స్ లేకుండా మ్యాజిక్ చేసిన చిత్రమిది. ఇద్దరు నాయికలు సంయుక్తా మీనన్, కేథరీన్ ట్రెసా లకు పేరుకు పాత్రలు ఉన్నాయి గానీ వాటికి పర్మార్మెన్స్ కు స్కోప్ లేదు. పాటల వరకు పనికొచ్చారు. జుబేదా పాత్రలో శ్రీనివాస రెడ్డి నవ్వించాడు. విలన్ గా వివాన్ భటేనా ఆకట్టుకున్నాడు.

కీరవాణి నేపథ్య సంగీతం సినిమాలోని చాలా సన్నివేశాలకు ప్రాణం పోసింది. సాధారణ సన్నివేశాలు కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్ల ఆకట్టుకున్నాయి. ఈ తరహా సినిమాలకు కీరవాణి న్యాయం చేయగలడని మరోసారి ప్రూవ్ అయ్యింది. చిరంతన్ భట్ సంగీతాన్ని అందించిన పాటల్లో ఈశ్వరుడే ఒక్కటే బాగుంది. ఎడిటింగ్ , సినిమాటోగ్రఫీ బాగున్నాయి.

చివరగా…బాక్సాఫీస్ ను గెల్చిన బింబిసార

నటీనటులు – కళ్యాణ్ రామ్, కేథరీన్ ట్రెసా, సంయుక్త మీనన్, ప్రకాష్ రాజ్, వివాన్ బటేనా, శ్రీనివాసరెడ్డి తదితరులు

సాంకేతిక నిపుణులు – సినిమాటోగ్రఫీ – ఛోటా కె నాయుడు, ఎడిటింగ్ – తమ్మిరాజు, నేపథ్య సంగీతం – ఎంఎం కీరవాణి, సంగీతం – చిరంతన్ భట్, నిర్మాణం – ఎన్టీఆర్ ఆర్ట్స్, నిర్మాత – కె హరికృష్ణ, రచన దర్శకత్వం – వశిష్ఠ

రేటింగ్ : 3.25/5

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar