Home / ANDHRAPRADESH / చంద్రబాబు ఎదుటే కేశినేని నాని ఫ్రస్టేషన్‌!

చంద్రబాబు ఎదుటే కేశినేని నాని ఫ్రస్టేషన్‌!

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని మరోసారి తన ఫ్రస్టేషన్‌ను బయటపెట్టారు. విజయవాడలో తన సోదరుడు కేశినేని శివనాథ్‌ను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారంటూ గత కొంతకాలంగా గుర్రుగా ఉన్న కేశినేని నాని.. పార్టీ అధినేత ముందే తన అసహనాన్ని ప్రదర్శించారు.

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అక్కడ టీడీపీ ఎంపీలు ఆయనకు స్వాగతం పలుకుతూ బొకేలు అందించి ఫొటోలు దిగారు. ఈ క్రమంలో చంద్రబాబుకు బొకే ఇవ్వాలంటూ కేశినేని నానిని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ కోరారు. ఆ సమయంలో జయదేవ్‌ ఇచ్చిన బొకేను విసురుగా నెట్టేసి ‘మీరే ఇవ్వండి’ అన్నట్టుగా ఫ్రస్టేషన్‌ చూపించారు. దీంతో చేసేదేమీ లేక గల్లా జయదేవ్ చంద్రబాబుకు బొకే అందించారు. ఆ సమయంలో కేశినేని నానిలో అసహనం స్పష్టంగా కనిపించింది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar