Home / MOVIES / రీఎంట్రీ కోసం బిందు మాధవి ఆరాటం

రీఎంట్రీ కోసం బిందు మాధవి ఆరాటం

అప్పుడేప్పుడో విడుదలైన ‘ఆవకాయ్‌ బిరియానీ’, ‘బంపర్‌ ఆఫర్‌’, ‘పిల్ల జమిందార్‌’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’ చిత్రాలతో ఆకట్టుకొంది బిందు మాధవి. తెలుగమ్మాయే అయినా, తమిళంలోనూ సినిమాలు చేసింది. నిజం చెప్పాలంటే తెలుగులో కంటే తమిళంలోనే తాను బిజీ. ఇప్పటికీ.. తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది.

అయితే కెరీర్‌ మొదలెట్టి ఇన్నేళ్లయినా సరైన బ్రేక్‌ రాలేదన్నది వాస్తవం. తెలుగులోనూ తన రీ ఎంట్రీ కోసం తహతహలాడుతోంది. అందుకే ఈమధ్య ఓ స్పెషల్‌ ఫొటో షూట్‌ చేసింది. అందులో ఘాటైన అందాలతో మత్తెక్కించింది. ఇలాంటి ఫొటో షూట్‌లతో అవకాశాలు వస్తాయేమో అన్నది బిందు ప్లాన్‌. ప్రస్తుతం ఆ ఫొటోలన్నీ సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి.

దాంతో పాటుగా తెలుగులో అవకాశాల కోసం బిందు గట్టిగా ప్రయత్నిస్తోందని టాక్‌. వెబ్‌ సిరీస్‌, వెబ్‌ మూవీ, చిన్న సినిమా, పెద్ద సినిమా.. ఇలా ఏదైనా సరే, అవకాశాల్ని అందిపుచ్చుకోవాలని చూస్తోంది. ఈమధ్య తెలుగులో వెబ్‌ సిరీ్‌సల హవా ఎక్కువగా సాగుతోంది. ఆ వైపు నుంచి బిందుకి ఛాన్సులు వస్తున్నాయిని తెలుస్తోంది. బోల్డ్‌ క్యారెక్టర్లు చేయడానికి సైతం.. తాను సిద్ధమే అని చెబుతోందట. చూద్దాం… ఈసారైనా తనని తాను నిరూపించుకుంటుందేమో…?

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri