సినిమా ఇండస్ట్రీ ఏదైన సరే హీరోలకు సంబంధించి కానీ హీరోయిన్ లకు సంబంధించి కానీ విడాకుల విషయం కానీ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న వార్తలు మనం వింటూనే ఉన్నాము. తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
2014లో హృతిక్ రోషన్ నుంచి విడిపోయిన సునానే.. ప్రస్తుతం అర్స్గాన్ గోనీతో ప్రేమలో ఉంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు హృతిక్ కూడా సింగర్ సాబా అజాద్లో డేటింగ్ చేస్తున్నాడు.