Home / INTERNATIONAL / మరోసారి సంచలనం సృష్టించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌

మరోసారి సంచలనం సృష్టించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌

తాము అనుకున్న  లక్ష్యం సాధించే వరకు ఉక్రెయిన్‌పై సైనిక చర్య కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పష్టం చేశారు. ఆంక్షల ద్వారా రష్యాను ఒంటిరిని చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు గుప్పించారు. ఫార్ ఈస్టర్న్ పోర్ట్ సిటీ వ్లాడివోస్టాక్‌లో జరిగిన ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో పాల్గొన్న పుతిన్‌.. ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలోని రక్షించడమే ప్రధాన లక్ష్యమన్నారు.

సైనిక చర్యను ప్రారంభించింది తాము కాదని, దాన్ని అంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తమ చర్యలన్నీ డాన్‌బాస్‌ వాసులకు సహాయం చేయడమే లక్ష్యంగా ఉన్నామని, ఇది తమ కర్తవ్యమని.. ఈ లక్ష్యాన్ని సాధించడం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వివిధ పాశ్చాత్య ఆంక్షల నేపథ్యంలో రష్యా తన సార్వభౌమాధికారాన్ని పటిష్టం చేసిందని పునరుద్ఘాటించారు. పాశ్చాత్య ఆర్థిక, సాంకేతిక దాడికి ప్రతి స్పందించామని, తాము ఏమీ కోల్పోలేదన్నారు.

ఇదిలా ఉండగా.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వచ్చే వారంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ఉబ్జెకిస్థాన్‌లో సమావేశం కానున్నారు. ఈ నెల 15-16 తేదీల్లో ఉబ్జెకిస్థాన్‌లో షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలు సమావేశమవుతారని చైనాలోని రష్యా రాయబారి ఆండ్రీ డెనిసోవ్ తెలిపారు. ఇంతకు ముందు ఉక్రెయిన్‌కు రష్యా సైన్యాన్ని పంపే ముందు ఇద్దరు నేతలు బీజింగ్‌లో సమావేశమయ్యారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat