Home / NATIONAL / కేంద్ర సర్వీసులు వద్దంటున్న అఖిల భారత సర్వీస్‌ (ఏఐఎస్‌) అధికారులు

కేంద్ర సర్వీసులు వద్దంటున్న అఖిల భారత సర్వీస్‌ (ఏఐఎస్‌) అధికారులు

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలో బీజేపీ సర్కారు తీరుతో కేంద్ర సర్వీసులంటేనే అఖిల భారత సర్వీస్‌   అధికారులు ఇష్టపడటం లేదు. ఆ వైపు కూడా చూడటం లేదు. దీంతో వారిని డిప్యూటేషన్‌పై ఢిల్లీకి పంపాలని కేంద్రం రాష్ర్టాలను విన్నవిస్తున్నది.

దీనికి కారణం ఏంటంటే కేంద్రంలో సరిపడా ఏఐఎస్‌లు లేకపోవటమే. అఖిల భారత సర్వీసుల్లో సంస్కరణలు చేపట్టే దిశగా ప్రిన్సిపల్‌ సెక్రటరీస్‌ ఆఫ్‌ స్టేట్స్‌/యూటీస్‌ కాన్ఫరెన్స్‌ జరిగింది. ఇందులో పాల్గొన్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌.. రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో చొరవ తీసుకోవాలని విన్నవించారు.

వాస్తవానికి కేంద్ర సర్వీసుల్లో పనిచేయాలనేది చాలా మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల కోరిక. కానీ, కేంద్ర పెద్దల ఒత్తిడి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి వల్ల ఆ దిక్కే చూడటం లేదు. గత ఐదేండ్లలో 563 మందికి డిప్యూటేషన్‌ అవకాశం వచ్చినా, 397 మందే ఆసక్తి చూపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino