Home / NATIONAL / అమ్మ నాకు కాటుక పెడుతోంది.. చాక్లెట్లు దాచేస్తోంది.. జైల్లో పెట్టండి!

అమ్మ నాకు కాటుక పెడుతోంది.. చాక్లెట్లు దాచేస్తోంది.. జైల్లో పెట్టండి!

మధ్యప్రదేశ్‌లోని బుర్హన్‌పుర్ జిల్లా దేఢ్‌తలాయి గ్రామానికి చెందిన ఓ మూడేళ్ల బాబు సద్దామ్ తన తల్లి మీద పోలీస్ కంప్లైంట్‌ ఇచ్చాడు. ఇందుకు తన తండ్రిని పోలీసుల దగ్గరకు తీసుకెళ్లాలని పట్టుపట్టాడట. చేసేదేం లేక ఆ బుడ్డోడిని వెంట పెట్టుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు తండ్రీ. బుజ్జి బుజ్జి మాటలతో ఆ బడతడు పోలీసులకు తన తల్లి ఏం చేసిందో చెప్తుంటే అక్కడున్నవారికి నవ్వులే నవ్వులు. ఇంతకీ బుడ్డోడు ఏం చెప్పాడో తెలిస్తే మీరు నవ్వుకుంటారు.

సద్దామ్‌కు వాళ్ల అమ్మ తల స్నానం చేయించాక కాటుక పెడుతుందట. కాటుక పెట్టించుకోవడం 3 ఏళ్ల సద్దామ్‌కు ఇష్టం లేదట. వద్దని చెప్పినా వినని తల్లి చివరకు ఏడ్చి అల్లరి చేయగా బుడ్డోడి చెంప మీద చిన్నగా ఒక్కటిచ్చిందట. అంతే బుడతడికి వీపరీతమైన కోపం వచ్చేసింది. దీంతో వెంటనే గట్టిగా ఏడుస్తూ.. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్దాం రా.. అంటూ తండ్రిని పిలిచాడు. తండ్రి సర్ధిచెప్తే వినకుండా వస్తావా? రావా? అంటూ ఒకటే ఏడ్చి చివరకు తండ్రిని పోలీసుల దగ్గరకు తీసుకెళ్లాడు.

పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ ప్రియాంకా నాయక్‌కు సద్దామ్ తన తల్లి చేసింది చెప్పి కంప్లైంట్ తీసుకోమని పట్టుబట్టాడు. బాబు ప్రవర్తనతో ఒక్కసారిగా కడుపుబ్బా నవ్విన ఆమె మోకాళ్లపై కూర్చొని సద్దామ్ చెప్పిందంతా తెల్ల కాగితంపై రాసుకున్నారు. దీంతో శాంతించిన బుడ్డోడు ఎస్‌ఐకి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino