ఆర్థిక నేరగాడు సుకేశ్‌చంద్రశేఖర్ సహా పలువురి ప్రమేయం ఉన్న రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ ప్రముఖ నటి జాక్వెలిన్ మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెల్సిందే. అయితే ఈ కేసులో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది.
తాత్కాలిక బెయిల్‌ను నవంబరు 10 వరకు పొడిగించింది. సుకేశ్ చంద్రశేఖర్ నుంచి 7 కోట్ల రూపాయల విలువైన వస్తువులను బహుమతులుగా అందుకుంటున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జాక్వెలిన్ ప్రస్తుతం తాత్కాలిక బెయిల్‌పై ఉన్నారు.
ఈ నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ కోసం తన న్యాయవాది ప్రశాంత్ పాటిల్‌తో కలిసి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుకు హాజరయ్యారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను వచ్చే నెల 10న విచారిస్తామన్న కోర్టు.. అప్పటి వరకు ఆమె తాత్కాలిక బెయిలును పొడిగిస్తూ ఊరట కల్పించింది.