తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. అందాల రాక్షసి శృతిహాసన్ హీరోయిన్ గా .. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తుండగా పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బాబీ (KS Ravinder)దర్శకత్వం వహిస్తున్నాడు.
అయితే ఈ చిత్రంలో మాస్ మహారాజ్ రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ రోజు దీపావళీ సందర్భంగా మూవీ మేకర్స్ టైటిల్ టీజర్ ను విడుదల చేశారు.ఈ మూవీ 2023 జనవరి 13న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ రోజు విడుదలైన టీజర్ లో ఇలాంటి ఎంటర్‌టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్ స్క్రైబ్.. అంటూ ముఠామేస్త్రీ సినిమాను గుర్తు తెచ్చేలా.. బీడీ తాగుతూ స్టైలిష్‌గా లుంగీలో నడుచుకుంటూ వస్తూ స్టన్నింగ్ మాస్ లుక్‌లో అదరగొట్టేస్తున్నాడు చిరంజీవి.