పాన్ ఇండియా మూవీగా విడుదలై రికార్డులతో పాటు కలెక్షన్ల సునామీను సృష్టించిన ప్రముఖ చలన చిత్రం ఆర్ఆర్ఆర్. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా.. ఆలియా భట్ ,ఒలివియా మొర్రీస్ హీరోయిన్లుగా .. అజయ్ దేవగన్ ,శ్రియా చరణ్ ,సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకుపైగా కలెక్షన్లు వసూళ్లు చేసి రికార్డులు సృష్టించింది.
అయితే ఈ చిత్రం సటర్న్ అవార్డ్స్‌లో ‘ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డు’కు ఎంపికైంది. సటర్న్ అవార్డ్స్ ఈ ఏడాదితో 50 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక అమెరికన్ అవార్డును జ్యూరీ అధికారికంగా ప్రకటించింది. ఆర్ఆర్ఆర్ ను అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ మెంబర్స్ కు ఈ సందర్భంగా రాజమౌళి ధన్యవాదాలు తెలియజేశారు. అయితే ఇది జక్కన్నకు రెండో అవార్డు.. ఇంతకుముందు బాహుబలి : ది కంక్లూజన్ చిత్రానికి వచ్చింది.
Congrats to #SaturnAwards Best International Film – @RRRMovie pic.twitter.com/CGf8zPdCqQ
— The Official Saturn Awards! (@SaturnAwards) October 26, 2022