బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కి మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న ‘జల్సా’ పేరుతో ఒక ఇల్లు ఉంది. అయితే ఈ ఇంట్లో ప్రతి ఆదివారం అమితాబ్ తన అభిమానులను కలుస్తుంటారు. అభిమానులను కలిసే క్రమంలో బిగ్ బి తన కాళ్లకు చెప్పులు లేకుండా కలుస్తారు. ఈ విషయం బిగ్ బి అభిమానులను కలిసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే జల్సాలో అభిమానుల్ని ఎప్పుడు కలిసినా చెప్పులు తీసేస్తానని.. అభిమానులంటే తనకు భక్తి అని, వాళ్లను కలవడం ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం లాంటిదని బిగ్ బి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.