కన్నడ బ్యూటీ… నేషనల్ క్రష్ అయిన రష్మిక మందన్నా ఇన్ స్టా గ్రామ్ వేదికగా విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ‘గత కొంతకాలంగా నన్ను చాలా మంది విమర్శలు, నెగిటివిటీతో ఇబ్బంది పెడుతున్నారు. నేను అందరికీ నచ్చాల్సిన పని లేదు.
నేను మీకు నచ్చలేదంటే దానర్థం మీరు విమర్శలు చేయొచ్చని కాదు. మిమ్మల్ని సంతోషపెట్టడానికి ఎంత కష్టపడతానో నాకు తెలుసు. నేను మాట్లాడని విషయాలపై కూడా నన్ను విమర్శిస్తుంటే గుండె పగిలినట్టు ఉంటోంది’ అని ఆమె పేర్కొంది.