Home / CRIME / ఢిల్లీ తరహాలోనే యూపీలో సంఘటన -వివాహిత‌ను 6 ముక్క‌లుగా నరికి మరి…?

ఢిల్లీ తరహాలోనే యూపీలో సంఘటన -వివాహిత‌ను 6 ముక్క‌లుగా నరికి మరి…?

గత వారం రోజులుగా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన శ్ర‌ద్ధా వాక‌ర్ హ‌త్య ఘ‌ట‌న మ‌రువక ముందే  అలాంటి ఘ‌ట‌నే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే యూపీలోని అజంఘ‌ర్ జిల్లాలోని ఇషాక్‌పూర్ గ్రామానికి చెందిన ఆరాధ‌న‌కు ప్రిన్స్ యాద‌వ్‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఈ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. కానీ ఆమె ఈ ఏడాది ప్రారంభంలో మ‌రో యువ‌కుడితో వివాహం చేసుకుంది. ఈ క్ర‌మంలో ఆరాధ‌న‌పై యాద‌వ్ క‌క్ష పెంచుకున్నాడు. త‌న‌ను కాద‌ని మ‌రో వ్య‌క్తిని పెళ్లి చేసుకోవ‌డంతో యాద‌వ్ తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యాడు.

ఈ క్ర‌మంలో న‌వంబ‌ర్ 9వ తేదీన ఆరాధ‌నను యాద‌వ్ గుడికి వెళ్తామ‌ని చెప్పి బ‌య‌ట‌కు తీసుకెళ్లాడు. కానీ ఆమెను చెరుకు తోట‌ల్లోకి తీసుకెళ్లి ప‌దునైన ఆయుధాల‌తో చంపేశాడు. ఫ్రెండ్ స‌హాయంతో ఆమెను 6 భాగాలుగా న‌రికేశాడు. త‌ల‌ను వేరు చేశాడు. అనంత‌రం ఆమె శ‌రీర భాగాల‌ను ప‌శ్చిమి గ్రామ స‌మీపంలోని బావిలో ప‌డేశాడు. న‌వంబ‌ర్ 15న బావిలో తేలియాడుతున్న శ‌రీర భాగాల‌ను స్థానికులు గుర్తించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

ఘ‌టనాస్థలికి చేరుకున్న పోలీసులు వివాహిత శ‌రీర భాగాల‌ను స్వాధీనం చేసుకున్నారు. ద‌ర్యాప్తులో భాగంగా యాద‌వ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచార‌ణ చేప‌ట్టారు. అయితే ఆరాధ‌న త‌ల కోసం ప‌శ్చిమి గ్రామ స‌మీపంలోని చెరువు వ‌ద్ద‌కు యాద‌వ్‌ను తీసుకెళ్ల‌గా, అక్క‌డ దాచిన తుపాకీతో పోలీసుల‌పై కాల్పులు జ‌రిపాడు. దీంతో పోలీసులు కూడా అప్ర‌మ‌త్త‌మై ఎన్‌కౌంట‌ర్ చేశారు. యాద‌వ్ గాయాల పాల‌య్యాడు. ఈ కేసులో యాద‌వ్‌తో ప‌లువురిని పోలీసులు అరెస్టు చేశారు.

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar