Breaking News
Home / MOVIES / రానా తండ్రి కాబోతున్నాడా..?

రానా తండ్రి కాబోతున్నాడా..?

టాలీవుడ్‌ కి చెందిన సీనియర్ హీరో.. స్టార్ హీరో..  భల్లాళదేవుడుగా విశ్వఖ్యాతి నొందిన  రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ దంపతులు తల్లిదండ్రులు బోతున్నారంటూ గత కొంతకాలంగా సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈ జంట షేర్‌ చేసిన కొన్ని ఫొటోల్లో మిహీకా బొద్దుగా కనిపించడంతో రూమర్స్‌ మెదలయ్యాయి.

ఈ వార్తలపై ఇప్పటికే మిహీకా స్పందించారు. ఆ వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. తాజాగా, ఓ కార్యక్రమంలో పాల్గొన్న రానాకు ప్రముఖ గాయని కనికా కపూర్‌.. తండ్రి కాబోతున్నందుకు కంగ్రాట్స్‌ చెప్పారు. దీంతో ఈ వార్త మరోసారి తెరపైకి వచ్చింది.దీనిపై రానా స్పందించారు.

తన భార్య ప్రెగ్నెంట్‌ కాదని చెప్పారు. అంతేకాదు ‘నాకు బిడ్డ పుడితే కచ్చితంగా చెబుతాను.. నీకు బిడ్డ పుడితే నువ్వు కూడా చెప్పాలి’ అంటూ సరదాగా కనికాకు సమాధానమిచ్చారు. రానా, మిహీకా ఇద్దరూ స్నేహితులు. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. కొన్నేళ్ల ప్రేమ అనంతరం ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో 2020 ఆగస్టు 8న వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino