Home / MOVIES / యశోద వసూళ్లు ఎంత అంటే..?

యశోద వసూళ్లు ఎంత అంటే..?

శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై  శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మాతగా హారీష్ నారాయణ, హారీ  శంకర్ దర్శకత్వం వహించగా ఉన్ని ముకుందన్‌, రావు రమేశ్‌, మురళీ శర్మ, సంపత్‌ రాజ్‌ కీలకపాత్రలు పోషించగా వరలక్ష్మి శరత్‌ కుమార్ నెగెటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో..   స్టార్ హీరోయిన్ స‌మంత టైటిల్‌ రోల్‌ పోషించిన చిత్రం యశోద  . ఈ మూవీ  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్‌ 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఈ చిత్రం మొదటి రోజు నుంచి సక్సెస్‌ఫుల్ టాక్‌తో ప్రదర్శించబడుతుంది. తాజా అప్‌డేట్‌ ప్రకారం యశోద వరల్డ్‌ వైడ్‌గా రూ.33 కోట్లు వసూళ్లు చేసినట్టు ట్రేడ్‌ సర్కిల్ టాక్‌. యశోద ప్రాఫిట్‌ జోన్‌లో ఉన్నట్టు టాక్‌.సరోగసీ చుట్టూ తిరిగే సున్నితమైన అంశాల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత యాక్టింగ్ మెయిన్‌ హైలెట్‌గా నిలుస్తోంది.

హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రఫర్‌‌, యాక్షన్‌ డైరెక్టర్‌ యానిక్‌ బెన్‌ కంపోజ్‌ చేసిన యాక్షన్ సన్నివేశాల్లో సమంత పర్‌ఫార్మెన్స్ కు మూవీ లవర్స్ ఫిదా అవుతున్నారు. యశోద డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ ను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో దక్కించుకుంది. యశోద చిత్రానికి మణిశర్మ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, సంగీతం అందించారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino